ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న డేటా హ్యాక్ ప్రకంపనాలు, ఫేక్ న్యూస్ ఇష్యూ ఆ కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు ఎసరు తెచ్చి పెడుతున్నాయి. ఈ సోషల్ మీడియా దిగ్గజ చైర్మన్‌గా మార్క్ జుకర్‌బర్గ్‌ను తొలగించాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఫేస్‌బుక్ ఇంక్‌లో మెజార్టీ షేర్లను కలిగి ఉన్న నాలుగు దిగ్గజ అమెరికా పబ్లిక్ ఫండ్స్ బుధవారం మార్క్ జుకర్‌బర్గ్‌ను చైర్మన్‌గా తొలగించాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాయి.